SRD: వాతావరణ సమతుల్యాన్ని పాటించినప్పుడే ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకోగలమని GHMC రామచంద్రాపురం కార్పొరేటర్ శ్రీమతి పుష్ప నగేష్ అన్నారు. రామచంద్రపురం శ్రీనివాస నగర్ సండే మార్కెట్ ప్రాంత ప్రధాన రోడ్డు ఇరువైపుల ఆక్సిజన్ అతిగా ఇచ్చే చెట్లను నాటించామని తెలిపారు. మొక్కల పరిరక్షణకు నీటి అవసరాలు తీర్చడాని పెద్ద బోరును జిహెచ్ఎంసీ నిధులతో వేయించామని పేర్కొన్నారు.