TPT: పాకాల మండలం శంఖంపల్లిలో వెలసిన శ్రీ వీరాంజనేయస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని సందర్శించారు. ఇందులో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆలయంలో ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.