SDPT: TG తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో HYDలో 8వ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్యాడెట్ తైక్వాండో ఛాంపియన్షిప్-2025 పోటీలు జరుగుతున్నాయి. కాగా ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచి 4 మెడల్స్ సాధించారు. అండర్ 37 కిలోల విభాగంలో విద్యార్థి నిశాంత్ గోల్డ్ మెడల్ సాధించి, జాతీయస్థాయి టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు. ఈ ఘనత సాధించిన నిశాంతన్ను జిల్లా అసోసియేషన్ అభినందించారు.