VZM: వంగర మండలం మరువాడకు చెందిన పైడిరాజు సోమవారం రాజాం SBI ATMలో తన కొడుకు అకౌంట్‌కి రూ.లక్ష జమ చేసేందుకు వచ్చారు. పైడిరాజుకి కార్డ్ లెస్ డిపాజిట్ చేయడం రాకపోవడంతో అక్కడే ఉన్న గుర్తుతెలియని వ్యక్తి చేస్తానని నగదు తీసుకున్నాడు. ఆ వ్యక్తి నగదును తన అకౌంట్‌కి జమ చేసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. మోసపోయానని గ్రహించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.