తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హీరో అభినయ్ కింగర్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచాడు. కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆయన మృతి పట్ల తమిళ సినీ నటీనటులు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా, అతడు.. అరుముగ్, ఆరోహణం, సక్సెస్ వంటి పలు చిత్రాలలో నటించాడు.