ADB: పంట విక్రయాల్లో నిబంధనలు సడలించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును MLA పాయల్ శంకర్ కోరారు. ఈ మేరకు మంత్రి తుమ్మలను సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల సోయాబీన్ పంట నాణ్యత కొద్దిగా దెబ్బ తినడం వల్ల కొనుగోలు చేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.