అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె మండలానికి చెందిన అభినయ్ కడపలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో నవంబర్ 7 నుంచి 9 వరకు జరిగిన 69వ ఎసీఎఫ్ఎస్ఐ అంతర్ జిల్లాల ఆర్చరీ పోటీల్లో, అభినయ్ తన ప్రతిభను చాటాడు. దీంతో అతను కాంపౌండ్ బౌ అండర్-14 కేటగిరీ విభాగంలో బంగారు పతకం సాధించి, కడప జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు.