IPL-2026 సీజన్‌కు సంబంధించి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆ జట్టు ప్రస్తుత సారథి సంజూ శాంసన్‌ను ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో రాజస్థాన్ జట్టును యువ ఆటగాళ్లు అయిన యశస్వీ జైస్వాల్ లేదా ధ్రువ్ జురెల్‌లలో ఒకరు నడిపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.