BPT: కారంచేడు మండలంలోని అన్ని పంచాయతీల్లోనూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మండల ఎంపీడీవో నేతాజీ సోమవారం తెలిపారు. తుఫాను సమయంలో గ్రామాల్లో నీరు నిల్వ లేకుండా చూసేందుకు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని సూచించారు.