కర్నూలు జిల్లాలో కలెక్టర్ సిరి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.