TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సిబ్బందికి యూసుఫ్‌గూడ డీఆర్సీ సెంటర్లో ఈవీఎంలను అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈ సాయంత్రం పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సిబ్బంది చేరుకోనున్నారు. పోలింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ పర్యవేక్షిస్తున్నారు.