TG: జూబ్లీహిల్స్‌లో మద్యం ఏరులై పారుతోందని రాష్ట్ర ఎన్నికల అధికారికి BRS నేతలు ఫిర్యాదు చేశారు. ‘ఓటర్లకు మిక్సీలు, చీరలు పంచుతున్నారంటూ వీడియో రికార్డింగ్‌లను సమర్పించారు. రేపు దొంగ ఓట్లు పడే అవకాశం ఉందని.. పోలింగ్ బూత్‌ల దగ్గర కేంద్ర బలగాలను పెట్టాలని కోరారు. యూసుఫ్‌గూడలో కాంగ్రెస్ ఆఫీస్ పక్కనే ఉన్న.. పోలింగ్ బూత్‌ను మార్చాలని విజ్ఞప్తి చేశారు.