WGL: బీఆర్ఎస్కు షాక్.. నల్లబెల్లి మండలం బోలోని పల్లె గ్రామానికి చెందిన BRS నాయకులు తమ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరారని, పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.