WGL: చెన్నారావుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ ‘ఓపెన్ స్కూల్ సెంటర్’ ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్ అభ్యర్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మానుపాటి పాపమ్మ మాట్లాడుతూ.. విద్యార్థులు కృషితో చదివి ఉత్తీర్ణులవ్వాలని, ప్రత్యేక తరగతులకు హాజరవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.