కృష్ణా: పెడనలో రెండో పంట సాగు చేసుకునేందుకు ప్రభుత్వంతో చర్చిస్తామని మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం నియోజకవర్గంలో తీర ప్రాంత భూమి ఎక్కువగా ఉన్నందున అపరాలు పండే అవకాశం తక్కువగా ఉందన్నారు. ప్రధానంగా బంటుమిల్లి కాలువ కింద సాగయ్యే కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాలకు తప్పనిసరిగా దాళ్వా మంజూరు చేయాలని కోరారు.