SRPT: రచయిత అందెశ్రీ మృతి పట్ల కోదాడ ‘తెర’ సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు సంతాపం తెలిపారు. కోదాడ, ‘తెర’తో అందెశ్రీకి విడదీయరాని బంధం ఉందన్నారు. ఇటీవల దశాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొని ఆట, పాటను గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. “జై బోలో తెలంగాణ” పాట నిప్పుల వాగై ప్రవహించిందని, ఆయన పాటలు సజీవమని కొనియాడారు.