టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నెలనెలా తనకు భరణం, కుమార్తె సంరక్షణ కోసం చెల్లిస్తున్న రూ.4లక్షలు సరిపోవడం లేదని షమీ మాజీ భార్య హసీన్ జహాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం షమీకి, బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా స్పందించాలని తెలిపింది.