ATP: గుంతకల్లు మండలం తిమ్మంచెర్ల రైల్వేస్టేషన్లో భారతీయ రైల్వే, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆధ్వర్యంలో ఇవాళ మెగా మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ.. రైలు ప్రమాదాల సమయంలో భద్రతా సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడి ప్రాణనష్టాన్ని నివారించే విషయంపై ఈ మెగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.