MBNR: జడ్చర్ల మండలంలో ఇండస్ట్రియల్ కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ ఛైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు దళారులపై ఆధారపడకుండా ప్రభుత్వమే ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా నేరుగా పత్తిని అమ్ముకోవాలని సూచించారు. రైతుల ఉత్పత్తికి న్యాయమైన ధర లభించేలా మార్కెట్ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు.