KRNL: ఆదోనిలోని హవన్నపేట హెల్త్ సెంటర్లో డాక్టర్ షేకన్ శుక్రవారం క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. పౌష్టికాహార లోపంతో క్షయవ్యాధి బారిన పడిన వారికి ప్రభుత్వం నిత్యావసర సరుకులను ఉచితంగా అందిస్తుందన్నారు. 60 రోజులు తప్పకుండా మందులు వాడితే వ్యాధి నియంత్రించవచ్చని సూచించారు. ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు.