SKLM: క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం MLA గోండు శంకర్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయం వద్ద క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమం సంబంధిత అధికారులు నిర్వహించారు. సందేహం ఉన్న ప్రజలు క్యాన్సర్ వ్యాధి పరీక్షలు జరిపించుకోవాలని తెలిపారు. ముందుగా క్యాన్సర్‌ను తెలుసుకున్నట్లయితే దానిని నివారించవచ్చని స్పష్టం చేశారు.