తూ.గో: జిల్లా వ్యాప్తంగా ‘మన మిత్ర’ వాట్సాప్ ఆధారిత సేవలపై శుక్రవారం నుంచి డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వాట్సాప్ సేవల డెమో, క్యూఆర్ కోడ్ పంపిణీ, పాంప్లెట్లు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ప్రతి ఇంటిని నమోదు చేసి కుటుంబాల వివరాలను రికార్డ్ చేయాలన్నారు.