ADB: వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మార్చాలని 2022 డిసెంబర్ 2న ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 34ను అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు కోరారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. ఇవాళ పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ.. జీవో 34 అమలు చేయకపోవడంతో వికలాంగుల సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు.