W.G: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల సద్వినియోగం చేసుకోవాలని తణుకు ఏఎంసీ ఛైర్మన్ కొండేటి శివ కోరారు. సోమవారం తణుకు మండలం కోనాల, దువ్వ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేసినట్లు చెప్పారు.