AKP: మునగపాక మండలం నాగులపల్లి గ్రామంలో పూలమాల పండగ సందర్భంగా పార్వతి సాంబశివుడిని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఇవాళ దర్శించుకున్నారు. సాంబమూర్తికి ప్రత్యేక పూజలు పంచామృతాభిషేకం చేశారు. సాయంత్రం భక్తులు శరీరం, నాలుకపై శూలాలు గుచ్చుకొని ప్రదర్శన ఇస్తారని నిర్వాహకులు తెలిపారు.