SRD: కంగ్టి మండలం దెగులవాడి శివారులో గత 2 నెలల క్రితం నేలకొరిగిన విద్యుత్ స్తంభాన్ని సోమవారం సరి చేశారు. ఈ సమస్యపై ఆదివారం HIT TVలో ‘నేలకొరిగిన విద్యుత్ స్తంభాన్ని సరి చేయాలి’ అని శీర్షికతో కథనం ప్రచురితం అయింది. దీంతో విద్యుత్ లైన్మెన్ రాజు స్పందించి తమ అధికారుల సూచనలతో స్తంభాన్ని సరిచేశారు. సమస్య పరిష్కారం కావడంతో రైతులు HITకు ధన్యవాదాలు తెలిపారు.