HYD: బెట్టింగ్ యాడ్స్ చేస్తున్న సెలబ్రిటీలను ప్రశ్నిస్తూ.. వారిని ఆదర్శనీయ ఆటగాళ్లుగా పరిగణించలేమని సీపీ సజ్జనార్ అన్నారు. బెట్టింగ్ వ్యసనం వల్ల ఎంతో మంది యువకులు జీవితాలను నాశనం చేసుకుని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ‘X’లో ట్వీట్ చేశారు. సమాజాన్ని ఛిద్రం చేస్తున్న ఈ భూతాన్ని ప్రచారం చేసిన వీరు అనర్థాలకు బాధ్యులు కారా? అని నిలదీశారు.