JGL: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ఇవాళ శ్రీరాం యూత్, యువజన సంఘాల ఆధ్వర్యంలో వందేమాతరం జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సామూహికంగా వందేమాతరం జాతీయ గేయం ఆలపించారు. గేయ రచయిత బంకించంద్ర చటర్జీకి నివాళులు అర్పించారు. వందేమాతరం నినాదం లేని స్వాతంత్య్ర ఉద్యమం ఊహించలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మారుతి, తదితరులు పాల్గొన్నారు.