కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో 14 వేల ఎకరాల భూముల ఆక్రమణలపై మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్ నేతృత్వంలో సర్వే ప్రారంభమైంది. గురువారం బద్వేల్ ఆర్డిఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ టీమ్‌ల ఏర్పాటు, ఆక్రమిత భూముల లెక్క తేల్చే చర్యలు చేపట్టి పేదలకు యజమాన్య హక్కులు కల్పించనున్నట్టు MLA ప్రకటించారు.