TG: హైదరాబాద్ గన్ ఫౌండ్రీ వద్ద వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, MP లక్ష్మణ్ పాల్గొన్నారు. వందేమాతర ఉద్యమ సమయంలో రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిందని కిషన్ రెడ్డి అన్నారు. దేశమంతా స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు 13 నెలలు ఆలస్యమైందన్నారు.