ATP: కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామిని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ శనివారం దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రేయస్సు, సుఖసంతోషాలు, ఆరోగ్యం కలగాలని స్వామిని వేడుకున్నట్లు వారు పేర్కొన్నారు.