AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో అరెస్టు పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 27 మందిని సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. ప్రాథమిక విచారణలో 18 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల అరెస్టు తర్వాత కస్టడీ విచారణలో కీలక అంశాలు వెలుగులో వచ్చినట్లు సమాచారం.