TG: రాష్ట్రంలో ఎక్కడైనా నేరం, ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదంలో మృతి చెందిన సందర్భంలో ఫొటో గ్రాఫర్ ఫొటోలు తీస్తుండటం కనిపించేది. ఆ ఫొటోలను ప్రింట్ తీసి.. పోలీసులు సాక్ష్యంగా FIRలో నమోదు చేసుకునేవారు. అయితే ప్రస్తుతం ఈ-సాక్ష్య యాప్ రావడంతో.. ఫొటోగ్రాఫర్లతో పనిలేకుండా పోయింది. నేరుగా పోలీసులే తమ మొబైల్లో ఫొటో తీసి.. అందులో అప్లోడ్ చేస్తున్నారు.