TG: విద్యాహక్కు చట్టం రాకముందే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇవ్వాలని NCTEని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(TPUS)కోరింది. దీనిపై స్పందించిన NCTE ఛైర్మన్ పంకజ్ అరోరా.. ఈ నెల 18న ప్రత్యేకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి సమావేశం ఏర్పాటు చేశారని.. దాంట్లో ఈ అంశంపై చర్చిస్తామని తెలిపారు.