‘మత్తు వదలరా’, ‘మత్తు వదలరా 2’లతో మంచి ఫేమ్ సంపాదించుకున్న దర్శకుడు రితేష్ రాణా సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో సత్య హీరోగా నటిస్తుండగా.. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా వెండితెరకు పరిచయం కాబోతుంది. ఇందులో వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు.