KRNL: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శుక్రవారం బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కష్టకాలంలో ఉన్న అనారోగ్య బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా ఇప్పటివరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రూ.1.20 కోట్ల చెక్కులు పంపిణీ చేసి ఆదుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు.