E.G: వందేమాతరం కేవలం గీతం కాదని, భారతీయుల అస్మిత, గౌరవం, అభిమానం, ఏకత్వానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ కిర్తీ చేకూరి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వందేమాతరం150 ఏళ్ల సంస్మరణోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని వందేమాతరం గీతాలాపన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వందేమాతరం గీతాన్ని స్మరించుకోవాలని పిలుపు ఇచ్చారు.