వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జాతీయ రహదారుల శాఖ, సివిక్ బాడీలు, హైవే గస్తీ బృందాలు వీటిని పాటించాలని తెలిపింది. హైవేలపై తిరుగుతున్న ఆలనపాలన లేని పశువులను షెల్టర్లకు తరలించాలని సూచించింది. మరోవైపు వైద్యశాలలు, విద్యాసంస్థల ప్రాంగణాల్లో కుక్కకాటు ఘటనలపై సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది.