దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, హైవేలపై కుక్కలు, ఆవులు, ఇతర జంతువులు తిరగడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ జంతువుల సంచారం వల్ల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కలిసి సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.