కృష్ణా: అయ్యప్ప మాలధారుల కావడి యాత్ర ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అవనిగడ్డ నుంచి మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి మాలధారులు పాల కావడి, పూలు, పండ్ల కావడులతో తరలివెళ్లారు. ప్రధాన సెంటరులో నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ కావడి యాత్రకు స్వాగతం పలికి, కావడి అందుకుని యాత్రలో భాగస్వాములు అయ్యారు.