NTR: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నియోజకవర్గంలో యాక్టీవ్ అవుతున్నారని పలువురు చెబుతున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత వంశీ పొలిటికల్‌గా సైలెంట్ అయిపోయారు. ఒకానొక దశలో పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకున్నారన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగింది. కాగా, ఇటీవల వై.ఎస్. జగన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వంశీ కూడా పాల్గొన్నారు.