GNTR: ప్రైవేట్ మెడికల్ కళాశాలకు వ్యతిరేకంగా వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలో ఇవాళ రచ్చబండ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ప్రత్తిపాడు సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం వల్ల పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారని మండిపడ్డారు.