KMR: జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు భిక్నూర్ PS పరిధిలోని NH-44 టోల్ ప్లాజా వద్ద శుక్రవారం ఉదయం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో 1,139 వాహనాలను తనిఖీ చేయగా 27 మంది డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. అలాగే ఓ బస్సు డ్రైవర్ మద్యం తాగి 45 మంది ప్రయాణికులతో బస్సు నడుపుతుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.