అన్నమయ్య: కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో రాయచోటి నియోజకవర్గం గణనీయమైన అభివృద్ధి సాధించిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చిన్నమండెంలో జరిగిన 3 లక్షల ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాయచోటిలో తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ. 30 కోట్లతో బోర్లు వేసినట్లు పేర్కొన్నారు. జల జీవన్ మిషన్ కింద రూ. 300 కోట్లతో 840 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నట్లు వివరించారు.