KMR: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మినీ రైస్ మిల్లును పరిశీలించారు. గ్రామ స్థాయిలో ఇలాంటి యూనిట్లు రైతులు, మహిళా సంఘాలకు ఆర్థిక లాభం చేకూరుస్తాయన్నారు. గంటకు 250 కిలోల వడ్లను ప్రాసెస్ చేసే ఈ మిల్ సింగిల్ ఫేస్ కరెంట్‌తో పనిచేస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి, రైతు ఆదాయం పెంపులో దోహదం చేస్తుందన్నారు.