ఆసిఫాబాద్: వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం DIEO రాందాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా బోధన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాల అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత, హాజరు శాతం పెంచాలని సూచించారు.