AP: ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. త్వరలో అందుబాటులోకి ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ అందుబాటులోకి రాబోతుందని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా అడవితల్లి బాటకు అనుసంధానించాలని సూచించారు. సాస్కీ నిధులతో పల్లె పండుగ 2.O ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను పవన్ ఆదేశించారు.