TPT: తిరుపతి పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 44 మందికి 3వ అదనపు జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సంధ్యారాణి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ చారి తెలిపారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి రూ. 10వేలు చొప్పున 44 మందికి 4,40,000 జరిమానా విధించినట్లు చెప్పారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.