JGL: వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోరుట్ల పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులు “వందేమాతరం 150” ఆకారంలో కూర్చోవడం పలువురిని ఆకట్టుకుంది. అలాగే విద్యార్థులు, అధ్యాపకులు, తదితరులు కలిసి వందేమాతరం గేయాన్ని ఈ సందర్భంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.