గుంటూరులోని చుట్టగుంటలోని అన్న క్యాంటీన్‌ను కమిషనర్ పులి శ్రీనివాసులు ఇవాళ తనిఖీ చేశారు. భోజనం నాణ్యత, రుచిపై వినియోగదారుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆయన సూచించారు. మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.